కోనసీమ జిల్లాను “అంబేద్కర్ కోనసీమ” జిల్లా గా పేరు మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. పీఆర్సి జీవోలో చేసిన మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అంతేకాదు.. నాలుగు రోజుల కిందట గెజిట్ కూడా విడుదల చేసింది. దీనిపై కోనసీమలో ఆందోళనలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. అంబేద్కర్ ను యావత్తు ప్రపంచమే కొనియాడుతుందని లేఖ లో వివరించారు. అటువంటి మహా వ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించుకునుట న్యాయం లేదని చెప్పారు. అంబేద్కర్ పేరు మన ప్రాంతానికి పెట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలని పేర్కొన్నారు. అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టిన దానికి అభ్యంతరం పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు ముద్రగడ పద్మనాభం. జగన్ తీసుకున్న నిర్ణయం మంచిదన్నారు.