ఇదే జరిగితే… ముంబై నగరంలో లాక్ డౌన్ తప్పదంటున్న మేయర్

-

దేశ వాణిజ్య రాజధాని ముంబైని కరోనా కేసులు భయపెడుతున్నాయి. రికార్డ్ స్ఠాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముంబైలో సోమవారం 8,082 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది ఏప్రిల్ 18, 2021 నుండి అత్యధిక రోజువారీ సంఖ్య. అయితే ముంబైలో రోజూవారీ కేసులు సంఖ్య 20 వేలను దాటితే ఖచ్చితంగా నగరంలో లాక్ డౌన్ తప్పదని ముంబై మేయర్ కిషోరీ ఫడ్నేకర్ అన్నారు. ప్రజలు ఎవరూ లాక్ డౌన్ కోరుకోరు… అయితే ప్రజలంతా తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు.

కేసులు పెరుగుతున్న క్రమంలో నగరంలో అన్ని విద్యా సంస్థల్ని మూసేశారు. కేవలం ఆన్ లైన్ క్లాసులు మాత్రమే జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే శివసేన పార్టీ తన కార్యక్రమాలను కూడా రద్దు చేసుకుంది. మరోవైపు మహారాష్ట్రలో ఓమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో ఎక్కువగా కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 500 పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ముంబై నగరంలో కేసులు తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news