ముంబై క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ కేసులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆర్యన్ తో పాటు 8 మందిని NCB అరెస్ట్ చేసింది. కోర్ట్ ఇప్పటికే ఆర్యన్ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తాజాగా ఈరోజు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై కోర్ట్ నిర్ణయం తీసుకోనుంది. NCB అధికారులు ఈనెల 14 వరకు ఆర్యన్ ను కస్టడీకీ కోరినప్పటికీ, రిమాండ్ రిపోర్ట్ సరిగా లేకపోవడం, మరిన్ని రోజులు కస్టడీకి కోరేందుకు సరైన కారణాలు లేవని కోర్ట్ ఇదివరకే తోసిపుచ్చింది. ఆర్యన్ తరుపున న్యాయవాదులు బెయిల్ పిటీషన్ మధ్యంతర బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో ఈ రోజు ముంబై కోర్ట్ బెయిల్ పిటీషన్ పై తీర్పు వెల్లడించనుంది. ఆర్యన్ దగ్గర విక్రయించేంతగా డ్రగ్స్ పట్టుబడకపోవడంతో పాటు తన స్నేహితులు పిలిస్తేనే పార్టీకి వెళ్లానని ఆర్యన్ కోర్టుకు తెలిపాడు. ఈ పరిణామాల మధ్య ఆర్యన్ ఖాన్ కు నేడు కోర్ట్ బెయిల్ ఇచ్చే పరిస్థతి కనిపిస్తోంది.