సర్కారు వారి పాట సినిమా నుండి” మురారివా” సాంగ్ రిలీజ్

-

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ కథానాయికగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. అన్ని పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. అందులో.. ‘మ మ మ మహేశా’, కళావతి సాంగ్స్ ట్రెండింగ్ లో నిలిచాయి.

ఇక మూవీలో ‘మురారివా’ అనే పాటను అనుకోని కారణాలవల్ల సినిమా లో పెట్టలేదు. అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజులకు ఈ పాటను యాడ్ చేశారు. తాజాగా ఈ పాటను యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్రబృందం. మహేష్, కీర్తి లపై బ్యూటిఫుల్ సెట్లో ఈ పాటను ఎంతో అందంగా షూట్ చేశారు చిత్రబృందం.

Read more RELATED
Recommended to you

Latest news