గుప్తా బిల్డర్స్ అండ్ ప్రమోటర్స్ సంస్థపై ఈడీ దాడులు

-

గుప్తా బిల్డర్స్ అండ్ ప్రమోటర్స్ సంస్థపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. సుమారు సంస్థకు సంబంధించిన 19 చోట్లల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. అంబాలా, పంచకుల, చండీఘడ్, మొహాలీ, ఢిల్లీ ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. మనీ ల్యాండరింగ్ కేసులో గుప్తా బిల్డర్స్ సంస్థ డైరెక్టర్లను ఈడీ విచారణ నిర్వహిస్తోంది. ఈ తనిఖీల్లో సుమారు 85 లక్షల నగదు, ఆడి-కూ 7 కార్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

గుప్తా బిల్డర్స్
గుప్తా బిల్డర్స్

గుప్తా బిల్డర్స్ డైరెక్టర్లు సతీశ్ గుప్తా, ప్రదీప్ గుప్తా, బాజ్వా డెవలపర్స్, కుమార్ బిల్డర్స్, విన్‌మెహతా ఫిల్మ్స్, డైరెక్టర్లు జార్నెల్ సింగ్ బాజ్వా, విశాల్ గార్, నవరాజ్ మిట్టర్, తదితరుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గుప్తా బిల్డర్స్ పై చండీఘడ్‌లో మనీ ల్యాండరింగ్ కేసు నమోదు అయింది. సుమారు రూ.325 కోట్లు మోసం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లకు మోసం, కమర్షియల్ భవనాల ఇప్పిస్తామని చెప్పి ఇవ్వకపోవడం, ఇళ్లు కొనుగోలు చేసే వారిని మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సేకరించిన సొమ్మును ఇతర కంపెనీలకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news