కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ఒక వింత ప్రయత్నం చేశారు. అతను చేసిన ఆ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చామరాజపేట నియోజకవర్గంలో అంబేడ్కర్ జయంతి, ఈద్ మిలాన్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్, దళిత పూజారి స్వామి నారాయణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జమీర్ ఖాన్ కుల వివక్షపై మాట్లాడారు. అనంతరం స్వామి నారాయణ్‌కు ఎమ్మెల్యే తన చేతితో ఆహారం తినిపించాడు. అనంతరం తనకూ అన్నం తినిపించాలని కోరాడు. దానికి స్వామి నారాయణ్ కూడా అన్నం తినిపించబోయాడు. ఇంతలో ఎమ్మెల్యే కలగజేసుకుని ఈ అన్నం కాదు.. నీ నోట్ల నమిలిన ఆహారాన్ని తీసి తినిపించూ.. అని కోరాడు. దీంతో స్వామి నారాయణ్ తను నమిలిన ఆహారాన్ని తినిపించారు. దీంతో అక్కడనున్న వారందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అందరూ ఎమ్మెల్యేను చప్పట్లతో అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.