మీ లైఫ్‌ పార్ట్‌నర్‌ గురించి ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి?

-

పెళ్ళై చాలా ఏళ్లు అయినా కూడా తమ లైఫ్ పార్ట్నర్ గురించి చాలా విషయాలు కొందరికి తెలియవని చెప్పాలి. సైగలతో చెప్పేవి అర్థం చేసుకోలేక బ్లాంక్ ఫేస్ పెట్టేస్తారు. ఇంకొందరైతే తమ జీవిత భాగస్వామి బాడీ లాంగ్వేజీని కూడా తెలుసుకోలేరు. కేవలం వారి మాటలు, భావోద్వేగాలే కాదు. ఇంకా భాగస్వామి గురించి తెలుసుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం..

ప్రతి ఒక్కరికి ప్రేమ భాషను ఉంటుంది.. ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం అయ్యేలా చేస్తారు.. మరికొందరు మాటల ద్వారా వారి ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇలా ఒక్కొక్కరి ప్రేమ భాష ఒక్కోలా ఉంటుంది. అందుకే మీ లైఫ్ పార్ట్‌నర్ యొక్క ప్రేమ భాష ఏమిటో తెలుసుకోవాలి.. దంపతుల మధ్య కెమిస్ట్రీ అంటే అది మానసికమైనది, భావోద్వేగమైనది. శారీరకంగా దగ్గరగా ఉండటం వేరు మానసికంగా దగ్గరగా ఉండటం వేరు. సంబంధంలో ఇద్దరు దంపతుల మధ్య కెమిస్ట్రీ బాగుండటం అంటే మానసికంగా ఒక్కటవ్వడం, ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి..

భార్యాభర్తల బంధంలో గొడవలు రావడం కామన్.. ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది. ఆ గతం నిండా ఎన్నో జ్ఞాపకాలు, గుర్తులు ఉంటాయి. అయితే ఆ జ్ఞాపకాలన్నీ పాజిటివ్ గానే ఉండాలని లేదు. కొన్ని మనస్సును గాయం చేసేవి కూడా ఉండొచ్చు. అయితే దాంపత్య బంధంలో ఉన్నప్పుడు వాటిని కూడా అంగీకరించాల్సి ఉంటుంది. ఏదైనా గొడవ జరిగినప్పుడు వాటిని తవ్వి విమర్శలు చేయడం వల్ల బంధం బలహీనపడుతుంది. ఇద్దరి మధ్య నమ్మకం, విశ్వాసం లేకుండా పోతుంది. గత గాయాన్ని ఎట్టి పరిస్థితులలో తవ్వకూడదు.. బంధం తెగిపోయే పరిస్థితి కి రావొచ్చు.. అందుకే ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి.. లేదా కలిసి మాట్లాడుకోవాలి.. ఇది తప్పక గుర్తుంచుకోండి.. అప్పుడే బంధం బలపడుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news