ఎంవీ గంగా విలాస్ ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే..!

-

రివర్ క్రూయిజ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన మార్గం. ఎంవీ గంగా విలాస్ ని శుక్రవారం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి మొదలు పెట్టారు. గంగా క్రూయిజ్ వారణాసి లోని గంగా నదిపై గంగా హారతితో ప్రయాణం స్టార్ట్ చేయనుంది.

ఇక పూర్తి వివరాలని చూస్తే ప్రసిద్ధ బౌద్ధ పుణ్యక్షేత్రమైన సారనాథ్, మయోంగ్, నదిలో నిర్మించిన మజులి అనే ద్వీపాన్ని మీదగా క్రూయిజ్ వెళ్లనుంది. అయితే ఈ క్రూయిజ్ ప్రయాణం మొదటి పర్యటన లో స్విట్జర్లాండ్‌కు తాలూకా వారు మొతం 32 మంది పర్యాటకులు ప్రయణించనున్నారు. ఎంవీ గంగా విలాస్ క్రూయిజ్ అనే ఓ షిప్ నుంచి బంగ్లాదేశ్‌ లోని 27 నదీ వ్యవస్థల ద్వారా ప్రయాణం ఉంటుంది.

ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు సహా 50 పర్యాటక ప్రదేశాల తో ఈ ప్రయాణం ఉంటుంది. బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సాం ఇలా 50 ప్రధాన నగరాల మీదుగా ఉంటుంది. జనవరి 13న వారణాసిలో మొదలు కాగా ఫిబ్రవరి 1 నాటికి దిబ్రూఘర్ రీచ్ అవుతారు. వారణాసి, కోల్‌కతా మధ్య ఎనిమిది రివర్ క్రూయిజ్‌లు నడుస్తున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news