మిస్టరీగా మారిన తాజ్‌మహాల్‌లోని 22 గదులు..

-

ప్రపంచంలో ఎన్నో మిస్టరీలు.. ఆ మిస్టరీలను ఛేదించేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. ఏదైనా వీడని మిస్టరీ గురించి ఏవైనా విషయాలు తెలిస్తే షాకింగ్‌గా అనిపిస్తుంది. అయితే.. ఇండియా వింతల్లో ఒకటైన.. తాజ్‌మహల్‌లో ఉన్న 22 గదులు ఉత్కంఠ రేపుతున్నాయి. తాజ్‌ మహల్‌లోని ఆ గదుల్లో ఏముందోనని అందరిలో ఆసక్తి పెరిగింది.. విషయానికి వస్తే.. తాజ్‌ మహల్‌ను కట్టించింది మొఘల్‌ చక్రవర్తి.. ఆయన ప్రియురాలు ముంతాజ్‌ ప్రేమ కోసం ఆ తాజ్‌మహల్‌ను కట్టించాడు అనే కథను మనం వింటునే ఉన్నాం.

అయితే.. అసలు తాజ్‌మహల్‌ నిర్మించడానికి ముందు అక్కడ ఓ శివాలయం ఉండేదని.. ఆ శివాలయం స్థలంలోనే తాజ్‌ మహల్‌ను కట్టారనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ వాదనకు బలం చేకూర్చేలా.. తాజ్‌ మహల్‌లో క్రింద భాగన ఉన్న 22 గదులు మూసివేయడం.. అక్కడికి ఎవ్వరిని అనుమతించపోవడంతో.. అందరి దృష్టి ఇప్పుడు ఆ 22 గదులపై పడింది. తాజాగా ఈ వ్యవహారం కోర్టుకి చేరడంతో మరోసారి ఈ వాదనలు దేశమంతటా వినిపిస్తున్నాయి. నాలుగు అంతస్థుల తాజ్ మహల్ లో కింది రెండు అంతస్థులలోని దాదాపు 22 గదులని ఎప్పుడో మూసేశారు.

అయితే వాటిని ఇప్పుడు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా తెరిపించాలని, అందులో ఉన్న రహస్యాలని బయట పెట్టాలని బీజేపీ అయోధ్య మీడియా ఇన్‌ఛార్జ్‌ రజనీష్‌ సింగ్‌ అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ గదుల్లో హిందూ దేవుళ్ళ విగ్రహాలు, శాసనాలు, రాత ప్రతులు, గత చరిత్రకు సంబంధించి ఆధారాలు ఉండొచ్చు. అందుకే ఆ గదులను తెరచి, వాటిలో ఏం ఉందో తెలుసుకుంటే, వివాదాలు పరిష్కారమవుతాయి. ఎటువంటి హాని జరగదు, ప్రజలకి నిజాలు తెలియాలి, దీనికి ఓ కమిటీ వేయాలి అని కూడా కోరారు. మరి ఈ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరిలో తాజ్ మహల్ లోని ఆ 22 గదుల్లో ఏముందో తెలుసుకోవాలని ఆసక్తి ఏర్పడింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news