కరోనాను చంపే.. ఎన్-95 కొత్త మాస్కులు!

-

కరోనా వైరస్ కారణంగా మాస్కుల వాడకం అధికమైంది. ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందే. మాస్కులు ధరించడం వల్ల గాల్లో ఉంటే వైరస్ నోటి ద్వారా వ్యాపించదని పరిశోధకులు చెబుతున్నారు. అయితే మొదట్లో వాడిన మాస్కులతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే ఆస్కారం అధికంగా ఉండేది. కానీ తాజాగా యూఎస్‌లోని రెన్‌సీలేర్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ ప్రజలకు శుభవార్తను తెలిపింది. కరోనా వైరస్‌ను చంపే కొత్త ఎన్-95 మాస్కును తయారు చేసినట్లు పరిశోధకుడు ఎడ్మండ్ పలెర్మో తెలిపారు. అలాగే ఈ మాస్కును ఎక్కువ రోజుల వరకు వాడవచ్చని పేర్కొన్నారు.

ఎన్-95 కొత్త మాస్కులు
ఎన్-95 కొత్త మాస్కులు

పాలీప్రొఫైలిన్‌ అనే రసాయనాన్ని వాడి ఎన్-95 మాస్కును తయారు చేసినట్లు ఎడ్మండ్ తెలిపారు. దీని వల్ల వైరస్ మాస్కులోకి ప్రవేశించకుండా అక్కడే అడ్డుకుంటుందని, ఆ తర్వాత వైరస్‌ను చంపేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ మాస్కును ధరించడం వల్ల వైరస్‌ను సమర్థవంతంగా నిర్మూలించవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ మాస్కును ధరించడానికి కంఫర్ట్ గా ఉంటుందని, శ్వాసకోశ సమస్య తలెత్తవని, ఇది పూర్తిగా సురక్షితమని ఎడ్మండ్ సూచించారు. త్వరలోనే ఈ మాస్కులు వాడుకలోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news