ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం : నాదెండ్ల

-

రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తున్నామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మేం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయం అని స్పష్టం చేశారు. టోఫెల్, పాల వెల్లువ పథకాలలో అవినీతిని బయటపెట్టామని వెల్లడించారు. ఇప్పుడు… విద్యాశాఖలో జరిగిన అవినీతిని బయటకు తెస్తున్నామని నాదెండ్ల వివరించారు. జగనన్న విద్యా కానుక పేరుతో ప్రవేశపెట్టిన కిట్స్ లో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో 5 కంపెనీలపై ఈడీ దాడులు చేసిందని, ఆ ఐదు కంపెనీలే విద్యా కానుక కిట్లు సరఫరా చేస్తున్నాయని నాదెండ్ల అన్నారు. ఆ ఐదు సంస్థలు ఒక సిండికేట్ గా ఏర్పడి పిల్లలకు నాసిరకం వస్తువులు సరఫరా చేస్తున్నాయని తెలిపారు.

YSRCP govt facing ire of public: Nadendla Manohar

ఏపీలోని అధికారి వైసీపీ ప్రభుత్వం మొత్తంగా రూ. 1050 కోట్లతో విద్యా కానుకను మెటీరియల్ కోసం 5 కంపెనీలకు కాంట్రాక్ట్ కట్టబెట్టారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అనంతరం ఆయా కంపెనీల ద్వారా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించి కొల్లగొట్టారని ఆయన అన్నారు. విద్యా కానుకలతో కొన్న ఆర్డర్స్ కేవలం 5 కంపెనీలకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
నాడు-నేడు పథకంలో రూ.16 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. రూ.6 వేల కోట్లు గ్రాంట్లు వచ్చాయని కానీ అందులో రూ.3,550 కోట్లే ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. మిగిలిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news