మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాన్స్.. వీడియో వైరల్

-

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజనుల వేషధారణలో నృత్యం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపతి ముర్ము ఎంపిక అయినందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, గిరిజనులు, బీజేపీ నేతలతో కలిసి డాన్స్ చేసి సందడి చేశారు.

సీఎం శివరాజ్ సింగ్ గిరిజనుల దుస్తులు ధరించి, చేతుల్లో నెమలీకలు, విల్లు చేతపట్టి గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు.రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపతి ముర్మును ఎంపిక చేయడం పట్ల చాలా సంతోషిస్తున్నట్లు సీఎం చౌహాన్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది మూర్ము నామినేషన్ దాఖలు చేయడానికి ముందు న్యూఢిల్లీ కి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news