స్టార్ హీరో నాగార్జున కొడుకుగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. అయితే ఆ స్థాయి బ్లాక్‌బస్టర్ మనోడికి పెద్దగా పడలేదనే చెప్పాలి. లవ్ ఎంటర్టైనర్ సినిమాలే చేస్తూ క్లాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వరుసగా సినిమాలు లైన్లో పెట్టాడు. ఇప్పటికే లవ్‌స్టోరీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకోవైపు విక్రమ్ కుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు.
దీనికోసం నాగచైతన్య ఇప్పటికే ఇటలీకి వెళ్లి షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇందులో రాశిఖన్నా హీరోయిన్గా చేస్తోంది. దీంతో పాటు బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ కథానాయకుడిగా చేస్తున్న లాల్‌సింగ్ చద్దా సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు చైతూ.
ఈ పాత్రలోకి మారాలంటేనే చాలా టైమ్ పడుతుందని తెలుస్తోంది. బాడీనీ పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే చైతూ 15రోజలు కేటాయించినట్టు సమాచారం. ఇక సినిమా షూటింగ్ అంతా లఢక్‌లో జరగనుంది. మరి ఈ పాత్రలో చైతూ ఎలా కనిపిస్తాడో చూడాలి.