బాలీవుడ్ హీరోయిన్​తో లవ్.. స్పందించిన నాగచైతన్య

-

ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌తో నటుడు నాగచైతన్య రిలేషన్‌లో ఉన్నారంటూ జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడింది. తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తలపై చైతన్య స్పందించారు. తనపై జరుగుతోన్న ప్రచారాలు చూస్తుంటే నవ్వొస్తుందని అన్నారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్‌ మీడియాకు చైతన్య ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘ఈ మధ్యకాలంలో మీ గురించి వచ్చిన ఏ రూమర్‌ చూసి నవ్వుకున్నారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘’ప్రతివారం నా గురించి ఏదో ఒక రూమర్‌ బయటకువస్తోంది. వాటిని చూస్తే ఫన్నీగా అనిపిస్తోంది. నా జీవితానికి ఎలాంటి సంబంధంలేని విషయాలపైనా ప్రచారాలు జరుగుతున్నాయి. మొదట వాటిని చూసినప్పుడు నవ్వొచ్చినప్పటికీ.. ఇప్పుడైతే వాటినస్సలు పట్టించుకోవడం లేదు’’’ అని చైతన్య వివరించారు.

నాగచైతన్య, ఓ బాలీవుడ్‌/టాలీవుడ్​ హీరోయిన్‌ శోభిత ధూళిపాళ్ల తో రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొన్నిరోజుల నుంచి నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, తరచూ డిన్నర్‌ పార్టీలకు వెళ్తున్నారంటూ ఇటీవల పలు పత్రికల్లోనూ కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో చై లేటెస్ట్‌ ఇంటర్వ్యూతో ప్రేమాయణం వార్తలకు పరోక్షంగా ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version