Love Story: ఆహాలో చైతూ ల‌వ్ సోర్టీ! ఎప్పుడంటే..!

-

Love Story: అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya), న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెర‌కెక్కిన సినిమా ‘లవ్ స్టోరీ’ (love story). ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల అయ్యింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ చేసింది. చాలా రోజుల తర్వాత ఇండియాలోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా కూడా లవ్ స్టొరీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఊహకందని క‌లెక్ష‌న్ల‌ను సొంతం చేసుకుంది.

అయితే.. కొంత మంది సినీ ల‌వ‌ర్స్ ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంద‌ని వేట్ చేస్తు్న్నారు. టాలీవుడ్ టాక్ ప్ర‌కారం.. ల‌వ్ స్టోరీ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా(Aha) ఓటీటీ సంస్థ కైవ‌సం చేసుకుంది. అయితే .. ఎప్పుడు ఓటీటీ ప్లాట్ ఫాంపై అందుబాటులోకి రానున్న‌దనే చ‌ర్చ న‌డుస్తుంది. అయితే సినిమా విడుదలైన యాబై రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌దని తెలుస్తుంది. ఈ ఊహాగానాలను బ‌ట్టి చూస్తే..లవ్ స్టోరి దీపావళీ కానుకగా ఓటీటీ ల‌వ‌ర్స్‌కు అందుబాటులోకి రానున్న‌ది. అయితే.. రిలీజ్ తేదీ మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్ర‌ముఖ‌ ఛానల్ స్టార్ మా (Star Maa)ద‌క్కించుకుంది. ఈ సినిమా మొదటి రోజే.. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా క‌లెక్ష‌న్స్‌ని సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ గ్రాస్ 16.8 కోట్ల మార్క్ ని అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news