నాగశౌర్య “కృష్ణ వ్రింద విహారి” టైటిల్ సాంగ్ రిలీజ్ !

-

యువ నటుడు నాగశౌర్య తాజా చిత్రం” కృష్ణ వ్రింద విహారి”. హనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షేర్లీ సేటియా హీరోయిన్ గా నటిస్తోంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉష మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్ ప్రసాద్ మూల్పురి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీ గా తిరిగెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషించారు.

వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య, తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర సంగీతంం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ” గుడు గుడు గుంజం గోవిందా టార్చర్ ఇట్లా ఉంటుందా” అంటూ ఈ పాట నడుస్తోంది. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రామ్ మిర్యాల ఆలపించాడు. ప్రేమించిన అమ్మాయి కోసం హీరో పడే పాట్లపై ఈ టైటిల్ సాంగ్ కొనసాగింది.

Read more RELATED
Recommended to you

Latest news