సికింద్రాబాద్ ఘటన.. తగ్గని మంటల ఉద్ధృతి.. సిబ్బందికి అస్వస్థత

-

సికింద్రాబాద్‌ పరిధి నల్లగుట్టలోని ఓ షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. డెక్కన్‌ నైట్‌వేర్‌ స్పోర్ట్స్‌ షోరూంలో ఉదయం 11 గంటల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలు పైఅంతస్తులో ఉన్న షోరూంకు అంటుకోవడంతో భారీగా పొగలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది  ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. సమీపంలోని దుస్తుల దుకాణంలోనూ పొగలు వచ్చాయి. అందులో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. దాదాపు 5 గంటల నుంచి అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు మంటలు అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

భవనం మూడు వైపుల నుంచి 15 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. అయినా మంటల ఉద్ధృతి తగ్గలేదు. మరో 4 భవనాలకు మంటలు వ్యాపించాయి. భవనం, చుట్టపక్కల ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. భవనంలో మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మంటలు, తీవ్రమైన పొగ వల్ల సహాయచర్యలకు విఘాతం కలుగుతోంది. తీవ్రమైన పొగ వల్ల ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news