రెండు తెలుగు రాష్ట్రాలలో,దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు. అష్టకష్టాలు ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని ఆదర్శనీయుడు, సుపరిపాలనకు ఆద్యుడు శ్రీరామచంద్రుడు. ప్రజాభీష్టాన్ని గౌరవించడమే రాముడు నడిచిన మార్గం, ఆచరించిన ధర్మం.
పదవి కోసం వక్రమార్గాలు తొక్కి, ప్రజలను సమస్యల్లో ముంచటం , ప్రతిపక్షాలను వేధించడం పాలనాధర్మం కాదు. ఇతరులను వేధించే రాక్షస ప్రవృత్తి అంతం కావాలి. సర్వజనావళిలో మానవత వెల్లివిరియాలి. శ్రీరాముడి గుణగణాలు మనందరిలో పెంపొందాలని ఆశిస్తున్నాను. ఆ శ్రీరామచంద్రుడు తెలుగువారందరికీ ఆయురారోగ్య ఐశ్యర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను.
– మీ నందమూరి బాలకృష్ణ