ప్రస్తుతం జనాలు సోషల్ మీడియాను ఏ రేంజ్ లో వాడుతున్నారో మన అందరికీ తెలిసిందే. ఈ సోషల్ మీడియాను సామాన్య జనం మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా వాడుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతుంటారు.
దానికి ప్రధాన కారణం తమ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ లను మరియు ఇతర విషయాలను ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి సోషల్ మీడియాను సినీరంగం వారు వేదికగా మార్చుకుంటున్నారు.
అయితే ఇలా సోషల్ మీడియాను వాడే క్రమంలో కొన్ని మంచి అంశాలు ఎదురైనప్పటికీ కొన్ని సందర్భాల్లో కొంతమంది నెటిజన్ల నుండి చేదు అనుభవాలు కూడా సెలబ్రిటీలకు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలను కొంత మంది నటీనటులు లైట్ తీసుకుంటూ ఉంటే, మరి కొంత మంది మాత్రం అలాంటి నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటారు.
తాజాగా హీరోయిన్ నందితా శ్వేత కు కూడా సోషల్ మీడియా వేదికగా ఒక చేదు అనుభవం ఎదురైంది. నందితా శ్వేత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కాలంలో కూడా పర్వాలేదు అనే రేంజ్ సినిమాలో నటిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా నందితా శ్వేత తన ఇన్స్టాలో లేటేస్ట్ ఫోటోస్ ను షేర్ చేసింది. అయితే నందితా శ్వేత పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు ఒక నేటిజెన్ అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. నీ శరీరాకృతిని చూసుకో.. నీ షేప్స్ కూడా చూసుకో.. కాస్త వర్కవుట్స్ చేయ్ అంటూ అసభ్యకరంగా కామెంట్ చేశాడు. దీనితో నందితా శ్వేత ఆ నేటిజెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
మనుషులు ఇలా ఎలా ఉంటారు. నేను దేవతను కాదు.. నేను మామూలు మనిషినే. అందరిలాగే నాకు బాధలు ఉంటాయి. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతారు. నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను.. ప్రస్తుతం నేను ఎలా ఉన్నా.. దాన్ని నేను ఇష్టపడుతున్నాను అంటూ నందితా శ్వేత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.