దసరా టీజర్‌ అప్‌డేట్‌.. మాస్‌ స్టైల్‌లో

-

నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దసరా. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉంది. అయితే తాజాగా.. దసరా టీజర్‌ అప్‌డేట్‌ మాస్‌ స్టైల్‌లో అందించి టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాడు నాని. ఓ పెద్దాయన బీడీ ముట్టించుకుని విసిరేసిన అగ్గిపుల్లతో చెలరేగిన మంటల విజువల్స్‌ తో డిజైన్‌ చేసిన వీడియోను షేర్ చేస్తూ.. జనవరి 30న టీజర్‌ విడుదల చేస్తున్నామని తెలిపాడు. దసరా ప్రమోషన్స్‌లో భాగంగా నాని అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ కూడా ఏర్పాటు చేశాడు.

Dasara | ఫైర్‌తో నాని దసరా టీజర్‌ అప్‌డేట్‌.. ట్రెండింగ్‌లో వీడియో

ఈ చిత్రంలో నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. దసరా ప్రాజెక్ట్‌లో సాయికుమార్, స‌ముద్రఖని, జ‌రీనా వ‌హ‌బ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పక్కా తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో మాస్ ఎంట‌ర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.సంతోష్ నారాయ‌ణ‌న్ ద‌స‌రా చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. నాని మరోవైపు శౌర్యువ్‌ దర్శకత్వంలో 30వ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news