ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా చిన్నప్పట్నుంచి నెల్లూరు జిల్లాలో పెరిగానని, యానాదుల అవస్థల గురించి ప్రత్యక్షంగా చూశాను.. బాధపడ్డానన్నారు. జై భీమ్ అనే పదం నా గుండెల్లో నిలిచిపోయిందని, చట్టాలు చేయడం కాదు.. ఆచరణలో చేసే మనస్సున్న మనిషి కావాలన్నారు. అంతేకాకుండా.. ‘ వ్యక్తి ఆరాధన మంచిది కాదు. నేను తప్పు చేస్తే నన్నూ నిలదీయాలి. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో దగ్గర నేనూ వివక్షకు గురయ్యాను. నాకు నీళ్లు ఇవ్వడానికి కూడా ఓ బ్రిటీష్ మహిళా నిరాకరించింది. మాకు గౌరవం ఇవ్వడం ఇష్టం లేకపంటే మా దేశంలో మీ ఎయిర్ వేస్ నడపొద్దని చెప్పాను.
పైలెట్ వచ్చి నాకు సారీ చెప్పారు. ఓ వ్యక్తికి శిరోముండనం చేస్తే.. ఆ సామాజిక వర్గంలో అందరికీ కోపం వస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉండాలి. ఎవరి జనాభా ఎంతుందో.. దానికి తగ్గట్టుగా బడ్జెట్ ఉండాలి. సాధికారత కల్పించడం పాలకులకు ఇష్టం ఉండదు. దేహీ అంటేనే ఇస్తారు.. కానీ పోరాటంతో సాధించుకోవాలి. రాజధాని భూ సమీకరణ సమయంలో అసైన్డ్ రైతులకు న్యాయం చేయగలిగాం. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములున్న దళితులకు న్యాయం జరిగేలా చూశాం. దేని కోసం సబ్ ప్లాన్ నిధులు వినియోగించాలో.. దానిని సంపూర్ణంగా అమలు చేస్తాం. సీఎం అయ్యాక.. నేను దాన్ని అమలు చేయలేకుంటే నన్ను నిలదీయవచ్చు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.