ఫ్రీ బస్సు జిల్లాకే పరిమితం: సీఎం చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు అలర్ట్. ఉచిత బస్సు సౌకర్యం పై కీలక ప్రకటన చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఆగస్టు 15వ తేదీ నుంచి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించబోతున్నట్లు తాజాగా వెల్లడించారు. అయితే ఫ్రీ బస్సు జిల్లాకే పరిమితం చేయబోతున్నట్లు అధికారికంగా ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. జిల్లా దాటితే… చార్జీలు వసూలు చేయబోతున్నారని సమాచారం అందుతోంది. అలాగే తెలుగు రాష్ట్రాల జల వివాదం పై కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.

సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయని ఈ సందర్భంగా వెల్లడించారు. తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ కావడం తన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు సాగినీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఈ తప్పిదాలను.. సరి చేసేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని ఈ సందర్భంగా గుర్తు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news