మరోసారి వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తాజాగా ఆయన చిత్తూరులో నిర్వహించిన యువగళం పాదయాత్రలో మాట్లాడుతూ.. జగన్ ఎన్ని వాహనాలైనా సీజ్ చేసుకో కానీ నా కార్యకర్తల జోలికి వస్తే సహించనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘పోలీసులు దొంగ కేసులు పెడితే అధికార మార్పిడి తరువాత జ్యుడీషియల్ ఎంక్వైరీలో శిక్షార్హులు. 2024 తరువాత జగన్ బయటకు వస్తే నేను చూసుకుంటా … భయం అంటే ఎంటో నేను చూపిస్తాజ బాబు అంటే ఒక బ్రాండ్ , జగన్ అంటే జైల్. ఒక్క చాన్స్ తో వచ్చి మూడున్నర సంవత్సరాలకే రాష్ట్రాన్ని నాశనం చేసాడు. మధ్యపాన నిషేదం అంటూ తన బినామీలతో మద్యం బాటిళ్ళను ఫ్యాక్టరీల ద్వారానూ, అక్రమ మద్యం ద్వారానూ సరఫరా చేస్తున్నాడు.
జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు పట్టిన శని. మన జిల్లాలో 20 వేల ఉద్యోగం కల్పించిన అమరరాజాను ప్రక్క రాష్ట్రానికి పంపేసాడు. జగన్ కలలుకనడం మానేసి పరదాలు తొలగించి బయటకు రావాలి. రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి, ల్యాండ్ కబ్జా, వైన్స్, మైన్స్ కబ్జా లలో నెంబర్ వన్ చేసాడు. ఢిల్లీకి వెళ్ళి తన కేసులు గురించి బ్రతిమాలుతున్నాడో, బాబాయి హత్య గురించి బ్రతిమాలుతున్నాడో తెలియడం లేదు. జగన్ క్రిమినల్ … అతను జిల్లాకు ఒక క్రిమినల్ తయారు చేసాడు. ఈ జిల్లాకు పెద్దిరెడ్డి పెద్ద క్రిమినల్ గా తయారయ్యాడు. జిల్లా లో ఏ అక్రమం జరిగినా పెద్దిరెడ్డి హస్తముంది. చిత్తూరు శాసన సభ్యుడు భూ కబ్జాదారుడు. ఇప్పటికే సుమారు 300 ఎకరాలు కబ్జా చేసాడు. జేయంసి, అతని అన్న కొడుకు కబ్జాలనే ప్రధాన ఆధాయ మార్గంగా ఎంచుకున్నాడు. నియోజకవర్గ అభివృద్ది విస్మరించి తన జేయంసి కంపనీని అభివృద్ది చేసుకుంటున్నాడు. చిత్తూరులో ఎవ్వరు ఇళ్ళు కట్టుకోవాలన్నా , కాంప్లక్స్ కట్టుకోవాలన్నా జేయంసి కి కప్పం కట్టాలి. మహావీర్ బ్రిడ్జి కి చంద్రబాబు హయాం లో నే టెండర్లు పిలిచాం … ఈ ఎమ్మెల్యే వాటా అడగటంతో పనులు ఆగిపోయింది.’ అని ఆయన మండిపడ్డారు.