బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభద్రత భావంతో ఉన్నారు : హరీశ్‌ రావు

-

మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌ నేతలపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్‌ రావు. ఇవాళ ఆయన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బీసీ బంధు, మైనార్టీ బంధు లబ్ధిదారులకు మంత్రి హరీశ్‌ రావు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరగుతున్నదని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

- Advertisement -

Expedite works of nine new medical colleges: Harish Rao

నిన్న ఒక్కరోజే 9 మెడికల్ కాలేజీ లు ప్రారంభించుకున్నామని, నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తున్నారని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా, ఒక రూపాయి అప్పు లేకుండా బీసీ బంధు కింద లబ్ధిదారులకు నేరుగా రూ.లక్ష ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయాలనే గొప్ప సంకల్పంతో బీసీ బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. బీసీల సంక్షేమంతోపాటు అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.

మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్‌ అన్నారు. మైనార్టీలు సురక్షితంగా ఉన్నారంటే అది తెలంగాణలోనేనని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభద్రత భావంతో ఉన్నారని తెలిపారు. మైనార్టీ సంక్షేమంతోపాటు విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. కర్ణాటకలో ముస్లిం మైనార్టీలు 90 లక్షల మంది ఉన్నారని, మహారాష్ట్రలో 1.5 కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో 2.55 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌లో 4 కోట్ల మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారని వెల్లడించారు. ఈ రాష్ట్రాల్లో ముస్లిం మైనార్టీల కోసం రూ.2 వేల కోట్లకు మించి బడ్జెట్ కేటాయించలేదని విమర్శించారు. అదే తెలంగాణలో 50 లక్షల మంది ముస్లింలు ఉంటే.. రూ.2 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించిందన్నారు. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఎంత కట్టుబడి ఉన్నారనేది ఆలోచించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...