న‌ర్సాపూర్‌లో అనేక‌మైన బాధ‌లు తీరాయి : సీఎం కేసీఆర్‌

-

ఒకప్పుడు న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి మంచి నీళ్లు రాక‌పోయేది.. కానీ ఇప్పుడు కోమ‌టిబండ నుంచి మంచినీళ్లు తీసుకొచ్చాం.. ఇప్పుడు మంచినీళ్ల బాధ లేదు.. ఇక పిల్లుట్ల కాలువ ద్వారా సాగునీరు తీసుకొస్తే, న‌ర్సాపూర్ వ‌జ్ర‌పు తున‌క‌లా త‌యారవుతద‌ని అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. మంజీరా న‌ది, హల్దీ న‌ది ఎట్ల ఉండేది కాంగ్రెస్ రాజ్యంలో. ఎవ‌ర‌న్న‌ ప‌ట్టించుకున్న‌డా..? ఇంకా వాళ్ల తెలివికి ఏం చేసిండ్రు అంటే ఈ రెండు న‌దుల మీ చెక్ డ్యాంలు క‌ట్టొద్ద‌ని బ్యాన్ పెట్టిండ్రు. ఈ రోజు రెండు న‌దుల మీద చెక్ డ్యాంలు క‌డితే అవి ఇప్పుడు జీవ‌న‌దుల్లా ఉంటున్నాయి. హ‌ల్దీ వాగుకు అయితే కాళేశ్వ‌రం నీళ్లు పోసి ఎండ‌కాలంలో మ‌త్త‌ళ్లు దుంకుతున్నాయి. బ్ర‌హ్మాండంగా పంట‌లు పండుతున్నాయి అని కేసీఆర్ తెలిపారు.

24 గంటల కరెంట్ వెస్ట్ అని రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. ఎవ్వరిని అడిగినా 24 గంటల కరెంట్ కావాలని అంటున్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం 3 గంటల కరెంట్ చాలని అంటున్నారు. ఇంకా 10హెచ్ పి మోటార్ పెట్టుకోవాలి అంటున్నారు. ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ధరణిని తీసివేస్తాం అంటున్నారు. ధరణి ఉంది కాబట్టే రైతు బంధు వస్తుంది. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తే రైతు బంధు ఎలా వస్తుంది. ధరణి పోతే మళ్లీ పాత కాలం వస్తుంది. ధరణి తీసేస్తే భూముల కబ్జాలు, పైరవీలు మళ్లీ పెరుగుతాయి. మూడేళ్లు కష్టపడి ధరణి తెచ్చాము. భూముల ధరలు పెరిగాయి..ధరణి లేకుంటే ఎన్నో గొడవలు జరిగేవి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఒరేయ్ సన్నాసి మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. కులాలు, మతాలు అనే ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నాం. సునీతా లక్ష్మా రెడ్డిని అభ్యర్థిగా పెడుదాం అన్నప్పుడు మదన్‌రెడ్డి సహకరించారు. మదన్ రెడ్డి నా చిరకాల మిత్రుడు ఆయనకి సముచిత స్థానం కల్పిస్తాం. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ. అన్ని మతాలను, సంప్రదాయాలను బీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తుంది’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news