ఆర్టీసీ బస్సెక్కిన నారా లోకేష్.. ప్రయాణికులతో ఆసక్తికర సంభాషణ

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతుంది. 20వ రోజు పాదయాత్రలో భాగంగా పిచ్చాటూరులో నారా లోకేష్ ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడుతూ చార్జీల అంశం ప్రస్తావించారు. టిడిపి ప్రభుత్వంలో ఆర్టీసీ చార్జీలు, ప్రస్తుత ఆర్టీసీ చార్జీల మధ్య వ్యత్యాసాన్ని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటిదాకా మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారని అన్నారు నారా లోకేష్. అన్ని పెరుగుతూనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సిబ్బంది పడుతున్న ఇబ్బందుల గురించి కండక్టర్ ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరారు. అలాగే ఆర్టీసీ సిబ్బందికి రావలసిన బెనిఫిట్స్ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత దక్కలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version