ఏపీ పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడులో వైసీపీ, టీడీపీ శ్రేణులు మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ శ్రేణులు చేసిన దాడిలో ఓ టీడీపీ కార్యకర్త చనిపోగా… మరికొందరు గాయపడ్డారు. ఈ దాడిలో వైసీపీ శ్రేణులు వేట కొడవళ్లతో దాడి
చేయడంతో టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఈ దాడిలో మరికొందరు టీడీపీ కార్యకర్తలు
గాయపడ్దారు. అయితే.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. టీడీపీకి చెందిన ఇంకెంత మందిని పొట్టనబెట్టుకుంటారని నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వైసీపీపై నిప్పులు చెరిగారు.
ఆంధ్రప్రదేశ్‌ను అరాచకప్రదేశ్‌గా మార్చేశారు, ఫ్యాక్షన్ నేపథ్యంతోపాటు నేర క్రూర మనస్తత్వం ఉన్న జగన్‌రెడ్డికి ఒక్క చాన్స్ పేరుతో ముఖ్యమంత్రి గద్దెనెక్కిస్తే ఆంధ్రప్రదేశ్‌ను అరాచకప్రదేశ్‌గా మార్చేశారని మండిపడ్డారు నారా లోకేష్. మొన్న సుబ్బయ్య, నిన్న చంద్రయ్య, నేడు జల్లయ్యని అంతం చేసిన మీరు ఇంకెంతకాలం సాగిస్తారు ఈ నరమేధం? అంటూ సీఎం జగన్‌ను నారా లోకేష్ నిలదీశారు. వైసీపీ మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జల్లయ్య కుటుంబాన్ని టీడీపీ ఆదుకుంటుందని, గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు నారా లోకేష్.
ఫ్యాక్షన్ నేపథ్యంతోపాటు నేర క్రూర మనస్తత్వం వున్న జగన్‌రెడ్డికి ఒక్క చాన్స్ పేరుతో ముఖ్యమంత్రి గద్దెనెక్కిస్తే ఆంధ్రప్రదేశ్ ని అరాచకప్రదేశ్‌గా మార్చేశాడు. పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ వర్గీయులపై వైసీపీ దాడి రాక్షసత్వానికి పరాకాష్ట.(1/4) pic.twitter.com/k8jcMbMUsA
— Lokesh Nara (@naralokesh) June 3, 2022