కమలం ఆపరేషన్..కాంగ్రెస్ సీనియర్లు రెడీనా.?

-

తెలంగాణలో బలపడటానికి బీజేపీ ఎప్పటికప్పుడు పదునైన వ్యూహాలతో ముందుకెళుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బీజేపీ పనిచేస్తుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. తమకు అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా బీజేపీ నేతలు వదులుకోవడం లేదు..తాము బలపడటానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ వీక్ అవ్వడం బీజేపీకి బాగా కలిసొస్తుంది.

పైగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ఏర్పడింది..కాంగ్రెస్ సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు పోరు నడుస్తోంది. రేవంత్‌ని టి‌పి‌సి‌సి పదవి నుంచి తప్పించాలని సీనియర్లు..సీనియర్లని నిలువరించాలని రేవంత్ వర్గం ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే క్రమంలో సీనియర్లు సేవ్ కాంగ్రెస్ పేరిట రాజకీయం చేస్తున్నారు. ఇదే క్రమంలో దిగ్విజయ్ సింగ్ ఎంట్రీ ఇచ్చి..పార్టీలోని సమస్యలని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అలాగే అందరి నేతలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

అంతా కలిసి పనిచేయాలని సూచించారు..అలాగే రాష్ట్రంలో పరిస్తితులని అధిష్టానం పెద్దలకు వివరించనున్నారు. అయితే దిగ్విజయ్ రాకతో సీనియర్లు కాస్త సైలెంట్ అయినట్లే ఉన్నారు..కానీ వారు నివురుకప్పిన నిప్పు మాదిరిగా ఉన్నారు. వారిలోని అసంతృప్తి ఇంకా తగ్గలేదు. ఇక అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి వారి రాజకీయం ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డిని పక్కన పెట్టకపోయినా కనీసం రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌ని అయినా మారిస్తే చాలు అని చూస్తున్నారు.

అది కూడా జరగకపోతే కొందరు సీనియర్లు సంచలన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కొందరు సీనియర్లపై కమలం పార్టీ ఫోకస్ చేసిందని తెలిసింది. ఎలాగైనా వారిని బీజేపీలోకి లాగాలని చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అధిష్టానం సైతం కాంగ్రెస్ సీనియర్లని పార్టీలోకి తీసుకురావాలని రాష్ట్ర నేతలకు సూచించారట. మరి ఎంతమంది కాంగ్రెస్ సీనియర్లు బీజేపీలోకి వస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news