ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగురవేయాలి – మంత్రి తలసాని

-

దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళులని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36 లోని ఫ్రీడమ్ పార్క్ లో మొక్కలు నాటారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందని అన్నారు.

దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి KCR ఆదేశాల మేరకు 15 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు. గాంధీ గురించి విద్యార్థుల కు తెలియజెప్పేందుకు ఉచితంగా గాంధీ చిత్ర ప్రదర్శన చేపట్టామన్నారు.

వజ్రోత్సవాలలో భాగంగా 75 ప్రాంతాల్లో ప్రీ డమ్ పార్క్ లను ఏర్పాటు చేసి మొక్కలు నాటడం జరుగుతుందన్నారు మంత్రి తలసాని. ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగురవేసి జాతి సమైక్యత, స్ఫూర్తి ని చాటాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news