రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రం జోద్పూర్ లో ఓ పెళ్లి వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జ్యోతి పూర్ లోని ఓ పెళ్లి వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలి ఏకంగా ఐదు మంది మరణించారు.
అలాగే మరో 50 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పెళ్లి నేపథ్యంలో వంటలు చేస్తున్న గదిలో ఒక్కసారిగా ఈ సిలిండర్ పేలినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం క్షత గాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇక దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.