కరోనా మహమ్మారి వల్ల ఎంతగానో సతమతమయ్యాము. అయితే ప్రభుత్వం కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి వ్యాక్సిన్ ని కూడా అందిస్తోంది. ఇప్పటికే చాలా మంది రెండు కరోనా వ్యాక్సిన్ డోసులు కూడా వేయించుకున్నారు. బూస్టర్ డోస్ ని కూడా చాలా మంది తీసుకున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి యూనియన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి సోమవారం నాడు ముఖ్యమైన విషయాన్ని చెప్పింది. ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే…
కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని. సాధువులు వంటి వాళ్ళకి ఐడెంటిటీ ప్రూఫ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి అవసరం లేదని.. కోవిన్ యాప్ లో రిజిస్టర్ అవ్వడానికి ఆధార్ కార్డు అవసరం లేదని చెప్పింది. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ పాస్బుక్, NPR స్మార్ట్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, యూనిక్ డిస్ ఎబిలిటీ లేదా డిస్ ఎబిలిటీ సర్టిఫికేట్ వంటి ప్రూఫ్ ఏమి కూడా అవసరం లేదని చెప్పింది.
సాధువులు, ఋషులు, నేరస్తులు, మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉండే వాళ్ళు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉండేవాళ్ళు, రోడ్ సైడ్ బెగ్గర్స్, రిహాబిలిటేషన్ సెంటర్ లేదా క్యాంప్స్ లో ఉండేవాళ్ళు ఎవరికీ కూడా ఈ 9 ఐడి ప్రూఫ్స్ అవసరం లేదని.. 18 లేదా అంత కంటే ఎక్కువ ఉన్న వాళ్లందరికీ కూడా ఈ ప్రూఫ్స్ ఏమీ లేకుండానే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 2, 2022 నాటికి 115 కోట్ల మంది కోవిన్ యాప్ లో వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ అయ్యారు. ఆధార్ కార్డు లేకుండా 87 లక్షల మంది రిజిస్టర్ అయ్యారని చెప్తున్నారు.