కేంద్ర ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా.. దిల్లీలో ఇవాళ ఆప్ మహార్యాలీ

-

కేంద్ర ప్రభుత్వంపై దిల్లీ సర్కార్ మరోసారి పోరాటం షురూ చేసింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల బ‌దిలీలు, పోస్టింగ్‌ల‌పై ప‌ట్టుకోసం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ పోరాటం ముమ్మరం చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు తీరుకు వ్యకతిరేకంగా దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ నిరసన కార్యక్రమానికి సుమారు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నాయకులు ఇప్పటికే వెల్లడించారు.

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తోపాటు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రామ్‌లీలా మైదాన్‌ చుట్టూ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. కార్యక్రమం కొనసాగుతున్నంత సేపు వాహనాల రాకపోకలను నియంత్రించాలని ట్రాఫిక్‌ పోలీసులను కోరారు. అదేవిధంగా అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సులను వేదిక వద్దకు తరలించారు. రామ్‌లీలా మైదానం ప్రవేశ ద్వారాల వద్ద మెటల్‌ డిటెక్టర్లు, ఆ ప్రాంతం చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news