BREAKING : టాప్-10 ధనవంతుల లిస్ట్ నుంచి అదానీ ఔట్

-

ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీతో పోటీ పడుతున్న ఈ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కు అధినేత. సోలార్‌, థర్మల్‌ విద్యుత్తు తయారీ, రవానా, ఓడరేవుల నిర్వహణ.. ఇలా పలు వ్యాపార కార్యకలాపాల వెనుక తనదైన ముద్ర వేశారు అదానీ.

అయితే, గౌతమ్ ఆదాని కి మరో దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. హిండెన్ బర్గ్ నివేదికతో గౌతమ్ ఆదాని సంపద మంచులా కరిగిపోతోంది. బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ ప్రకారం ఆయన ప్రపంచ టాప్-10 ధనవంతుల జాబితాలో చోటు కోల్పోయారు. ప్రస్తుతం ఆదాని 84.4 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. 3 రోజుల్లో ఆదాని సంపద 34 బిలి యన్ డాలర్లు కోల్పోయినట్లు తెలిపింది. హిండెన్ బర్గ్ రిపోర్టు రాకముందు ఆదాని మూడో స్థానంలో ఉండేవాడు. ముకేశ్ అంబానీ 12వ స్థానంలో కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news