అలెర్ట్.. ఆ సేవలకు ఆధార్ తప్పనిసరి..

-

ఎటువంటి సేవలు పొందాలన్నా కూడా ఆధార్ లింక్ తప్పనిసరిగా చేసి ఉండాలి. రేషన్ దగ్గర నుంచి హాస్పిటల్ సేవల వారరకు అన్ని కూడా ఆధార్ మీద ఆధారపడి ఉంటాయి. ఈ డాక్యుమెంట్‌ను ఐడెంటిటీ ప్రూఫ్‌గా, అడ్రస్ ప్రూఫ్‌గా సబ్మిట్ చేస్తుంటారు. అయితే ప్రతీ చోటా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలా? అసలు ఏఏ సేవలు పొందడానికి ఆధార్ నెంబర్ తప్పనిసరి? ఎక్కడెక్కడ ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు? ఇలాంటి సందేహాలు ఆధార్ కార్డ్ హోల్డర్స్‌లో మామూలే. అన్నిటికి ఆధార్ అవసరం లేదు.. మరి ఏఏ వాటికి ఆధార్ అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఐడీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్..

ఐడీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలనుకుంటే మీ ఆధార్ కార్డును సమర్పించవచ్చు. ఐడీ, అడ్రస్ మాత్రమే కాదు, మీ వయస్సు, జెండర్ ఇతర వివరాలను ప్రూఫ్‌గా ఇచ్చేందుకు ఆధార్ కార్డ్ ఉపయోగపడుతుంది.

పాస్‌పోర్ట్..

మన దేశం దాటి విదేశాలకు వెళ్లాలంటే మాత్రం.. కొత్త పాస్‌పోర్టుకు అప్లై చేయాలన్నా, పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయాలన్నా ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.

విద్యావ్యవస్థ ..

యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం, నీట్ లాంటి కాంపిటీటీవ్ ఎగ్జామ్స్ కోసం ఆధార్‌ను తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. అయితే స్కూళ్లల్లో అడ్మిషన్లకు పిల్లల ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు.

పెన్షన్ స్కీమ్‌..

పెన్షన్ స్కీమ్‌లో పెన్షన్ బెనిఫిట్స్ పొందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి.

వీటితో పాటుగా.. బ్యాంక్ సేవలు పొందాలన్న, రేషన్ సరుకులు పొందాలన్నా, ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌కు,పాన్ కార్డు మొదలగు వాటికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు లేకుంటే మాత్రం పైన తెలిపిన ఎటువంటి సేవలు పనిచేయవు.

Read more RELATED
Recommended to you

Latest news