‘జబర్దస్త్’ వీడటానికి కారణం అతనే..సత్యశ్రీ సంచలన కామెంట్స్..!!

-

తెలుగులో పాపులర్ కామెడీ షోగా ‘జబర్దస్త్’కు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సరదాగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటారు. ఇక ఈ షో ద్వారా ప్రేక్షకులను అలరించిన వారికి వెండితెరపైన కూడా చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. అలా వారి ప్రయాణం బుల్లితెర నుంచి వెండితెర వరకు సక్సెస్ ఫుల్ గా సాగుతున్నది.

 

ఇక ఈ షోలో లేడీ గెటప్స్ వేసే వారికి చక్కటి పేరుతో పాటు ఫేమ్ కూడా లభిస్తున్నది. అలా ‘జబర్దస్త్’ షో ద్వారా శాంతి, వినోద్ , తేజ, పవన్ పేరు సంపాదించుకున్నారు. అలా ‘జబర్దస్త్’లోకి లేడీ కమెడియన్ గా వచ్చి..తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది సత్యశ్రీ. ‘జబర్దస్త్’ నుంచి బయటకు వచ్చిన సత్య శ్రీ..తాజా ఇంటర్వ్యూలో ‘జబర్దస్త్’ వీడటానికి గల కారణాలను చెప్పింది.

‘జబర్దస్త్’ షో లో చమ్మక్ చంద్ర-వినోద్ జంటగా ఉండే వారు. వీరి స్కిట్స్ ను జనాలు విపరీతంగా ఎంజాయ్ చేసేవారు. వినోద్ షో నుంచి వెళ్లిపోయిన తర్వాత చమ్మక్ చంద్ర టీమ్ లో సత్య జాయిన్ అయింది. అలా చమ్మక్ చంద్ర-సత్య హిట్ పెయిర్ అయిపోయారు. అలా వీరి స్కిట్స్ ను ప్రజలు హ్యాపీగా చూసేవారు. కాగా, నాగబాబు ‘జబర్దస్త్’ వీడినపుడు, చమ్మక్ చంద్ర కూడా వెళ్లిపోయారు.

ఈ క్రమంలోనే తాను కూడా ‘జబర్దస్త్’ వీడానని సత్యశ్రీ వివరించింది. తన గురువు అయిన చమ్మక్ చంద్ర ‘జబర్దస్త్’ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలోనే తాను కూడా ‘జబర్దస్త్’ నుంచి బయటకు వచ్చానని తెలిపింది. ప్రస్తుతం చంద్ర సినిమాల్లో బిజీగా ఉన్నారని, తాను ‘అదిరింది’ షోలో చేస్తున్నానని పేర్కొంది సత్యశ్రీ.

Read more RELATED
Recommended to you

Latest news