కరోనా లాక్ డౌన్ ఇప్పుడు ఎప్పటి వరకు ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కరోనా దేశ వ్యాప్తంగా విస్తరించడంతో గత నెల 22 న లాక్ డౌన్ ని విధించింది కేంద్ర సర్కార్. ఇప్పుడు భారీగా కేసులు పెరిగాయి. దీనితో లాక్ డౌన్ ని మరో నెల రోజుల పాటు పెంచినా ఆశ్చర్యం లేదు అనే చెప్పాలి. త్వరలోనే లాక్ డౌన్ కి సంబంధించి గ్రీన్ జోన్ లలో కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే ఇక్కడ స్కూల్స్, పబ్లిక్ రవాణా, సినిమాలు, క్రికెట్ మ్యాచ్ లు, బార్లు ఓపెన్ చేసే అవకాశం లేదు. ఇక షాపింగ్ మాల్స్ ని కూడా ఓపెన్ చేసే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటిలో కూడా జనాలు అందరూ ఒక చోటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కామర్స్ సర్వీసుల విషయంలో కూడా కఠిన నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. గ్రీన్ జోన్ లకు మాత్రమే అనుమతి ఉండే అవకాశం ఉంది.
వర్క్ ఫ్రం ని ఇప్పటికే పెంచిన సంగతి తెలిసిందే . ఆటోలు అనుమతించినా సరే గ్రీన్ జోన్ కి మాత్రమే పరిమితం చేయడమే కాకుండా ఆటోలో ఎక్కువ మందిని అనుమతించవద్దు అని రైలు సర్వీసుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది స్పష్టత లేదు. రైలు సర్వీసులను విమాన సర్వీసులను దాదాపుగా అనుమతించే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసివేసే అవకాశం ఉంది.