ఢిల్లీకి మళ్ళీ కొత్త టెన్షన్.. ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీ వాసులు !

-

పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో మళ్ళీ పంట వ్యర్థాల కాల్చివేత మొదలయింది. అయితే రైతులు తమ పంట పొలాల్లోని వ్యవసాయ అవశేషాలను కాల్చి వేస్తుంటారు. కోతలు పూర్తయిన తర్వాత మిగిలిన పంట వ్యర్థాలు, గడ్డి వంటివాటిని తొలగించడానికి ఖర్చు చేయడం ఇష్టం లేక రైతులు అక్కడికక్కడే తగలబెడుతుంటారు. అయితే గత ఏడాది పెద్ద ఎత్తున ఇలా పంట తగల బెడుతుండడంతో సుప్రీం కోర్టు సైతం ఆపాలని ఆర్డర్స్ ఇచ్చింది.

ఈ క్రమంలో ఈ ప్రక్రియ అగుతుందని అనుకున్నారు. కానీ ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనగా పంట వ్యర్థాలను రైతులు తగులబెడుతున్నారు. ఈ పంటవ్యర్థాల కాల్చివేతతో ఢిల్లీ పరిసరాల్లో మళ్ళీ వాయు కాలుష్యం పెరిగింది. ఇప్పటికే కరోనాతో రకరకాల ఇబ్బందులు పడుతోన్న ఢిల్లీవాసులు ఇప్పుడు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news