జూన్‌ 4న స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్తాయ్‌: అమిత్‌షా

-

జూన్‌ 4వ తేదీన నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక, మన స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతకంటే ముందుగానే, ఎంపిక చేసుకున్న షేర్లను కొని పెట్టుకోవాల్సిందిగా మదుపర్లకు షా సూచించారు. స్టాక్‌ మార్కెట్‌ కుదుపులకు, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టడం సరికాదని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్‌ షా చెప్పారు.

‘నేను స్టాక్‌ మార్కెట్‌ కదలికలను అంచనా వేయలేను. కానీ సాధారణంగా కేంద్రంలో ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడినప్పుడు మార్కెట్లలో ర్యాలీని మనం చూస్తుంటాం. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 400కి పైగా సీట్లను గెల్చుకుంటుంది. మోదీ నేతృత్వంలో మళ్లీ స్థిరమైన ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రభావంతో స్టాక్‌ మార్కెట్లు పెరుగుతాయి. అని అమిత్ షా అన్నారు. ఈ నెలలో ఇప్పటికే చాలా రోజులు స్టాక్‌ మార్కెట్‌ నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news