పూరి సమీపంలో తీరం దాటిన వాయుగుండం

-

ఒడిశాలోని పూరి సమీపంలో వాయుగుండం ఇవాళ తీరం దాటింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. తీవ్ర వాయుగుండంగా మారి తాజాగా ఉత్తర ఒడిశా లోని పూరీ-పశ్చిమబెంగాల్ ప్రాంతం డేగ అల మధ్య తీరం దాటింది. దీంతో మూడు రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి.

ఇక  ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై వాయుగుండం ప్రభావం  కొనసాగుతోంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల కాలువకు గండ్లు పడ్డాయి. మరికొన్ని చోట్ల గ్రామాల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. మరి కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిలపై వరద నీరు ఉధృతిగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. మత్య్సకారులు మరో రెండు రోజులపాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version