అయోధ్య బాల రామున్ని దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు. అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ఈ నెలలో జరిగిన సంగతి తెలిసిందే. జనవరి వెన్నెల 22వ తేదీన అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చాలా గ్రాండ్గా జరిగింది. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు లక్షలలో అయోధ్య రామున్ని దర్శించుకుంటున్నారు భక్తులు.
ఏకంగా ఆరు రోజుల్లో 18.75 లక్షల మంది అయోధ్య రామున్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశ నలుమూలల నుంచి చలిని సైతం లెక్కచేయకుండా ఆ బాల రామున్ని దర్శించుకుంటున్నారు. ఇప్పటివరకు 18.75 లక్షల మంది అయోధ్యకు వచ్చారని అధికారులు వెల్లడించారు. జనవరి 23వ తేదీన 5 లక్షల మంది వచ్చారని తెలిపారు. ఇక జనవరి 24వ తేదీన 2.50 లక్షల మంది, జనవరి 26వ తేదీన 3.50 లక్షల మంది, జనవరి 27వ తేదీన 2.50 లక్షల మంది వచ్చారని స్పష్టం చేశారు అధికారులు. ఇక జనవరి 28వ తేదీన అంటే నిన్న 3.25 లక్షల మంది అయోధ్యకు తరలివచ్చారట.