బిహార్‌లో భాజపాకు దూరమవుతున్న జేడీ(యూ)కు చెక్ పెట్టేలా కమలదళం వ్యూహాలు రచిస్తోంది. మహాగట్‌బంధన్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తున్న నితీశ్ ఆశలపై నీళ్లు చల్లేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ సిన్హా.. ఆర్జేడీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
2021 మార్చి 23న అసెంబ్లీలో ‘పోలీసు బిల్లు’పై జరిగిన చర్చ సందర్భంగా ఆర్జేడీ నేతలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయంలోనే స్పీకర్ చర్యలు తీసుకుంటున్నారు. 18 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
స్పీకర్ విజయ్ సిన్హాకు ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజులోనే ఆయనకు కొవిడ్ నెగెటివ్ వచ్చింది. అంతకుముందే, ఆగమేఘాల మీద ఆయన క్రమశిక్షణా కమిటీ సమావేశానికి పిలుపునిచ్చారు. రామ్నారాయన్ మండల్ అధ్యక్షతన ఆదివారం జరిగిన భేటీలో 18 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేల భవితవ్యంపై చర్చలు జరిపారు.
ఎన్డీఏ నుంచి వైదొలిగేందుకు నితీశ్ ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో స్పీకర్.. వేగంగా చర్యలు తీసుకుంటుండటం గమనార్హం. ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.