మహారాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన బీజేపీ

-

ప్రస్తుతం మహారాష్ట్ర లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ నాయకులు రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. అసలు బీజేపీ నాయకులు ఎందుకు ఆ పని చేశారంటే!

ఇటీవల రిలీజ్ అయినా కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రేక్షకుల్ని ఇంతగా మెప్పించిన ఈ చిత్రం విజయవంతంగా నడిచేందుకు బీజేపీ నేతృత్వంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ప్రకటించారు. కానీ మహారాష్ట్ర లో మాత్రం ఆ విధమైన ప్రకటన వెలువడలేదు.

 

చిత్రానికి  పన్ను మినహాయింపు ఇవ్వాలని శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష బీజేపీ నేతలు లేవనెత్తారు. బీజేపీ ఎమ్మెల్యే రామ్ కథమ్ మాట్లాడుతూ ” బాలసాహెబ్ థాక్రే బ్రతికుంటే ఈ చిత్రానికి కశ్చితంగా పన్ను మినహాయింపు ప్రకటించేవారు అని కానీ ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కి మాత్రం పట్టడం” లేదని పేర్కొన్నారు.

 

 

1980 , 90 దశకల్లో కశ్మీరీ హిందూ పండిట్ల మీద కాశ్మీర్ జరిగిన హత్యాచారాలు కోసం చూపించిన ఈ చిత్రం అంటే ప్రభుత్వం లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సూతరము ఇష్టం లేదని పండిట్ల దీన గాథ అంటే వారికి చులకన అని పలికారు.

 

 

బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే మంగల్ ప్రభాత్ లోధా మాట్లాడుతూ చిత్రానికి అన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఇచ్చిన విధంగానే మహారాష్ట్ర లో సైతం ఇవ్వాలని పట్టుబట్టారు. లోధా కు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే లు సైతం గళం విప్పారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news