బీజేపీ ‘లోక్‌సభ’ ప్లాన్‌.. ప్రతి నియోజకవర్గంలో 1000 మంది ప్రముఖులతో భేటీ

-

కర్ణాటక ఫలితాలతో దెబ్బతిన్న బీజేపీ వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కేంద్రంలో మరోసారి పట్టు సాధించేందుకు వ్యూహాలను పదునుపెడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కార్ ఈ తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ‘మహా జన్‌సంపర్క్‌ అభియాన్‌’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగానే రేపటి నుంచి ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 1000 మంది ప్రముఖ వ్యక్తులను బీజేపీ నేతలు ప్రత్యేకంగా కలవనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

‘‘దేశవ్యాప్తంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న 1000 మంది ప్రముఖ వ్యక్తుల  జాబితాను సిద్ధం చేశాం. పద్మ అవార్డులు, రాష్ట్రపతి పతకాలు వంటి పురస్కారాలు సాధించిన వారు ఈ జాబితాలో ఉన్నారు. వీరందరికీ కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు కలిసి బీజేపీ విజయాలను వారికి వివరిస్తారు. మొత్తంగా 543 లోక్‌సభ నియోజవర్గాల్లో మే 31 నుంచి జూన్‌ 30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే దాదాపు 5.5లక్షల మందితో మా నేతలు సమావేశమవుతారు’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news