గుడ్ న్యూస్.. 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్

-

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచ దేశాలను కుదేపేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో రకాల కరోనా వ్యాక్సిన్లు వచ్చినప్పటికీ.. దీని తీవ్రత తగ్గడం లేదు. కరోనా ధర్డ్‌ ముగియగా.. మళ్లీ ఫోర్త్‌ వేవ్‌ అనే భయాలు ప్రజల్లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ల పై కీలక నిర్ణయం తీసుకుంది.

మనదేశంలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్ డోసు అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరోగ్య సిబ్బంది తో పాటు 60 సంవత్సరాలు నిండిన వారికి ప్రికాషనరీ డోసు పేరుతో మూడు డోసును కేంద్రం పంపిణీ చేస్తోంది.

ప్రపంచంలో పలు ప్రాంతాల్లో కేసులో పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం బూస్టర్ డోసు ల పంపిణీ చేయాలని భావిస్తోంది. భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై రెండు రోజుల్లో ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news