ఖలిస్తానీ ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్… భారతకు వ్యతిరేఖంగా పనిచేస్తే సహించం: బోరిస్ జాన్సన్

-

భారత్ లో రెండు రోజుల పర్యటన కోసం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. మొదటి రోజు అహ్మదాబాద్ లో పర్యటించిన బోరిస్ జాన్సన్… రెండో రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల అధికారులు, నేతల పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇదిలా ఉంటే భారత్ లో మళ్లీ పాగా వేయాలనుకంటున్న ఖలిస్తానీ గ్రూప్ గురించి బోరిస్ జాన్సన్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ కు వ్యతిరేఖంగా బెదిరింపులకు పాల్పడే తీవ్రవాదులను సహించబోమని ఆయన అన్నారు. ఇండియాకు సహాయం చేయడానికి తీవ్రవాద వ్యతిరేఖ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని బోరిస్ జాన్సన్ చెప్పుకొచ్చారు. ఆర్థిక నేరగాళ్లు నీరివ్ మోదీ, విజయ్ మల్యాలను భారత్ కు అప్పగించే విషయంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ చట్టాన్ని తప్పించుకోవడానికి మా న్యాయ వ్యవస్థను ఉపయోగించుకచునే వ్యక్తులను మేం స్వాగతించమని… అప్పగింత కేసుల్లో న్యాయపరమైన చిక్కులు ప్రక్రియను కష్టతరం చేశాయని… యూకే ప్రభుత్వం వారిని అప్పగించాలని ఆదేశించినట్లు బోరిస్ జాన్సన్ వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news