BREAKING: డీకే శివకుమార్ రాజీనామా..! క్లారిటీ

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఒకెత్తయితే, ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు అన్నది తేల్చడం మరో ఎత్తు అన్నట్టుగా పరిస్థితి తయారయింది. నూతన ముఖ్యమంత్రి ఎవరు అన్నదానిపై ఇప్పటికీ సస్పెన్స్ వీడడం లేదు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక కాంగ్రెస్ రథసారధి డీకే శివకుమార్ రాజీనామా చేయబోతున్నారని సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే వీటిపై తాజాగా స్పందించారు డీకే శివకుమార్. తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తనకి తల్లి లాంటిదని, పార్టీకి రాజీనామా చేసే అవకాశం లేదని తేల్చి చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు డీకే శివకుమార్. ఇక కాసేపటి క్రితం ఖర్గేతో భేటీ అయ్యారు శివకుమార్. మరోవైపు సాయంత్రం 6 గంటలకు సిద్ధరామయ్యతో ఖర్గే సమావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news