లీవ్‌లో ఉన్న ఉద్యోగికి కాల్‌ చేస్తే రూ. లక్ష ఫైన్..!!

-

ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఆఫీస్‌ వర్క్‌.. ఇంటికి వచ్చిన తర్వాత మన ప్రపంచం మనకు ఉండాలి.. ఆఫీస్‌ ప్రజర్‌ అక్కడే వదిలేయాలి అని అందరూ ఉద్యోగులు అనుకుంటారు..కానీ చాలా ఉద్యోగాలు అలా లేవు.. తొమ్మిది గంటల పని చేస్తే.. మిగత టైమ్‌ అంతా ఆ పని గురించి ఆలోచించడానికే సరిపోతుంది. ఇంకా లీవ్‌ రోజు కూడా ఇదే తంతు.. ఆఫీస్‌ నుంచి ఏదో ఒక పని మీద కాల్స్‌ వస్తుంటాయి.. ముఖ్యంగా ఈ సమస్య..సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌లో ఉంటుంది.. కానీ ఓ కంపెనీ లీవ్‌లో ఉన్న ఉద్యోగికి కాల్‌ చేస్తే లక్ష రూపాయల ఫైన్‌ వేసే పద్ధతిని తీసుకొచ్చింది..ముంబైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగులకు ఇలా 1,00,000 రూపాయలు జరిమానా (Fine)విధిస్తుంది.
ముంబైకి చెందిన డ్రీమ్ స్పోర్ట్స్ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఉద్యోగులకు ఊరట కలిగించేలా కొత్త రూల్‌ ప్రవేశ పెట్టింది.. ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు సహోద్యోగులు పని పరంగా డిస్టర్బ్ చేయకూడదని, అలా చేసిన వారు రూ.1 లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించింది.
ప్రముఖ బెట్టింగ్ ప్లాట్ ఫాం ‘డ్రీమ్ 11’ని నిర్వహిస్తున్న సంస్థే డ్రీమ్ స్పోర్ట్స్. ఏడాదిలో ఒకసారి ఉద్యోగులకు కంపెనీ వారం రోజుల పాటు వెకేషన్ సెలవును మంజూరు చేస్తుంది.. ఈ వారం రోజుల్లో ఉద్యోగి కంపెనీకి సంబంధించిన ఎలాంటి విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తనదైన ప్రపంచంలో విహరించేందుకు, తనకు ఇష్టమైన ప్రదేశాలను చుట్టిచ్చేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఈ సమయంలో వృత్తి పరమైన అవసరాల కోసం సహోద్యోగులు సదరు ఉద్యోగికి ఫోన్ చేయడం వల్ల అతడి స్వేచ్ఛకు, గౌరవానికి భంగం కలిగించినట్లు అవుతుందని డ్రీమ్ స్పోర్ట్స్ భావించి ఈ నిర్ణయం తీసుకుంది..

నో కాల్స్, నో మెయిల్స్..

ఉద్యోగి సెలవు మూడ్‌ని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ రూల్ తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈవో, కో ఫౌండర్ హర్ష జైన్ తెలిపారు…సంవత్సరంలో ఒకసారి వారం రోజుల పాటు వృత్తి వ్యవస్థ నుంచి ఉద్యోగులకు పూర్తిగా విముక్తి కల్పిస్తున్నట్లు జైన్ సీఎన్‌బీసీ ఛానల్‌తో తెలిపారు. ఈ సమయంలో ఉద్యోగికి ఫోన్లు, ఈ మెయిళ్లు, స్లాక్‌ల రూపంలో అంతరాయాలు ఉండబోవని స్పష్టం చేశారు.

డబుల్‌ బెనిఫిట్స్..

ఇలా చేయడం వల్ల రెండు రకాలుగా లబ్ధి చేకూరుతుందని జైన్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగి సెలవును గౌరవించడంతో పాటు, కంపెనీ స్థితిగతులపై ఓ క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు..ఎలా అంటే…ఏయే ఉద్యోగులపై కంపెనీ బాగా ఆధారపడి పనిచేస్తుందనే విషయం ఈ టెక్నిక్‌ ద్వారా సులువుగా తెలిసిపోతుంది.. చాలా రోజులుగా ఇది పకడ్బందీగా అమలవుతోందని జైన్ స్పష్టం చేశారు..ఈ ఐడియా ఏదో బానే ఉంది. మన ఆఫీసులో కూడా ఇంప్లిమెంట్‌ చేస్తే బాగుండూ అని ఈపాటికే అనుకోని ఉంటారే..!!

Read more RELATED
Recommended to you

Latest news