దేశంలో కరోనా కేసులు ఎప్పుడు అయితే మొదలయ్యాయో అక్కడి నుంచి కూడా ఐటి కంపెనీలు చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించాయి. ఐటి కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశాలు ఇచ్చాయి. ఇక కేంద్రం కూడా దీనికి అనుమతులు ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే… తాజాగా కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఐటి, బిపిఓ కంపెనీలకు ఇంటి నుంచి పని కోసం కనెక్టివిటీ నిబంధనలను డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. వర్క్ ఫ్రం హోం టైం ఈ నెల 31 తో ముగుస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా కేసులకు సంబంధించిన ఆందోళనను దృష్టిలో ఉంచుకుని… 2020 డిసెంబర్ 31 వరకు ఇతర సేవా సంస్థలకు నిబంధనలు మరియు షరతులలో సడలింపులను కేంద్రం పెంచింది. ప్రస్తుతం, ఐటి వర్క్‌ఫోర్స్‌లో 85 శాతం మంది ఇంటి నుండే పనిచేస్తున్నారు. త్యవ్సరం అయిన ఉద్యోగులు మాత్రమే ఆఫీసులకు వెళ్తున్నారు.