కరోనా హాట్‌స్పాట్‌ లను గుర్తించండి – రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

-

ఇండియాలో కోవిడ్ పరిస్థితులపై రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. కోవిడ్ 19 నిర్వహణ, ప్రజారోగ్య సంసిద్ధతపై రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ… గతంలో కోవిడ్ పరిస్థితులు ను ఎదుర్కొన్నట్లుగా కేంద్ర, రాష్ట్రాలు సహకార స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-కోవిడ్ ప్రోటోకాల్ అమలును కొంసాగించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం.

రేపు,ఎల్లుండి జిల్లా స్థాయిలో ప్రజారోగ్య అధికారులతో కోవిడ్ సంసిద్ధతను సమీక్షించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కోరిన కేంద్ర ఆరోగ్యమంత్రి.. ఏప్రిల్ 10, 11వ తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలను కోరారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రులు ఆసుపత్రులను సందర్శించి కోవిడ్ మాక్ డ్రిల్ కసరత్తులను సమీక్షించాలని కోరిన కేంద్ర ఆరోగ్యమంత్రి… కోవిడ్ కేసుల పెరుగుదల పై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని మరియు కోవిడ్-19 నిర్వహణ కోసం సంసిద్ధతతో ఉండాలని సూచించారు.అత్యవసర హాట్‌స్పాట్‌లను గుర్తించాలని ,కోవిడ్ పరీక్షలు, టీకాలు వేయడం ,ఆసుపత్రి మౌలిక సదుపాయాల సంసిద్ధతను నిర్ధారించుకోవలని రాష్ట్రాలకు సూచించిన కేంద్రం…గతంలో కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా కేంద్ర, రాష్ట్రాలు సహకార స్ఫూర్తితో పనిచేయాలి.. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-కోవిడ్ ప్రొటోకాల్ అమలును కొంసాగించాలని రాష్ట్రాలకు సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news