ఉగ్రవాది చస్తే ఎవరికి ఇవ్వకుండా కాల్చేయండి…!

-

ఒక పక్క కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా ఉన్నా సరే ఉగ్రవాదులు మాత్రం సరిహద్దుల్లో భారత ఆర్మీ సహా పలువురిపై దాడులకు దిగుతున్నారు. దీనితో నిఘా వర్గాల సహకారంతో ఉగ్రవాదులను ఎరేస్తున్నారు. దాదాపు 20 రోజుల్లో 15 మందికి పైగా ఉగ్రవాదులను భారత ఆర్మీ కాల్చి చంపింది. గతంలో ఎవరిని అయినా ఉగ్రవాదులను కాల్చి చంపితే వారి శవాలను స్థానికంగా ఉండే బంధువులకు ఇచ్చే వారు.

ఇక ఇప్పుడు అలా కాదు. వాళ్లకు ఇస్తే ఊరేగింపు చేస్తున్నారని, వాళ్ళను పూడ్చి పెట్టిన ప్రదేశాన్ని అదో పవిత్ర స్థలం చేస్తున్నారని ఆగ్రహంగా ఉన్న కేంద్రం ఇక వాళ్ళను ఎవరికి ఇవ్వొద్దని, ప్రభుత్వమే కాల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో కాశ్మీర్‌లోని సోపూర్‌లో జెషే మహ్మద్ ఉగ్రవాది సజాద్ నవాబ్ దార్… సైన్యం కాల్పుల్లో హతమవ్వగా… అంత్యక్రియలకు వందల మంది స్థానికులు హాజరు అయ్యారు.

దీనితో లాక్ డౌన్ అమలు చేయడం కూడా కష్టంగా మారింది. ఏప్రిల్ 22న జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు చావగా… వాళ్ళ అంత్యక్రియలను ప్రభుత్వమే పూర్తి చేసింది. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చచ్చిన వాడు ఏమీ సంఘ సంస్కర్త కాదు కాబట్టి ఇదే కరెక్ట్ అని, దాని వలన దేశానికి పోయేదీ ఏమీ లేదని, అవసరం అయితే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news